కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:11 AM
గ్రామాల్లో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు.
కవిటి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు. బుధవారం కవిటిలో పీఏసీఎస్ భవన నిర్మాణానికి, లండారిపుట్టుగలో పల్లెపండుగలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన, గొండ్యాలపుట్టుగ ,కొత్తపాలెంల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రజాసంక్షేమానికి పాటుపడుతోందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు నిధులు వెచ్చిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండేళ్లలో గ్రామాలను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మించామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్‌ప్రదాన్, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బి.చిన్నబాబు, రైల్వే బోర్డు సభ్యు డు రంగారౌళో, టీడీపీ మండలాధ్యక్షుడు పి.కృష్ణారావు, ఎస్‌వీ రమణ, బి.రమేష్, ఎ.మధు, భీమారావురౌళోలు పాల్గొన్నారు.