Share News

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:09 AM

కూట మి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు అన్నా రు.

  కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
పార్టీలో చేరిన వారితో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

కంచిలి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు అన్నా రు. కొండ పోలేరు-ఒడిశా సరిహద్దు వరకు రూ.45 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన రోడ్డు, పోలేరు నుంచి కొండ పోలేరు వరకు రూ.86.86 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు వెళుతోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలు వురు అధికారులు పాల్గొన్నారు.

41 కుటుంబాలు టీడీపీలో చేరిక

కొల్లూరు పంచాయతీ పరిధిలోని గుండం గ్రామానికి చెందిన 41 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నా యుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు చౌదరి అవినాష్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల పురుషోత్తం రెడ్డి, నేతలు మాదిన రామారావు, జగదీష్‌ పట్నాయక్‌, పైల రామారావు, బంగారు కురయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:09 AM