అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2026 | 12:16 AM
Pension distribution అభివృద్ధి, సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్ర వారం నందిగాం మండలం లఖిదాసుపురంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తితో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో ఆసరా
మంత్రి కె.అచ్చెన్నాయుడు
నందిగాం, మే 1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్ర వారం నందిగాం మండలం లఖిదాసుపురంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తితో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఆసరా కలిగిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కాగా మంత్రి పర్య టన సాయంత్రం వర్షంలోనే సాగింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.