అభివృద్ధి, సంక్షేమం చంద్రన్నకే సాధ్యం
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:47 PM
అభివృద్ధి, సంక్షేమం సమతుల్యత పాటిస్తూ పాలన సాగించడం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం సమతుల్యత పాటిస్తూ పాలన సాగించడం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో నియోజక వర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 38 మందికి మంజూరైన నూతన పింఛన్లను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కూటమి ప్రభుత్వం సామాజిక భద్రత ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అవగాహన లేని పాలన చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్ర బాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమష్టిగా పనిచేస్తూ రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకువస్తూ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షు రాలు మెట్ట సుజాత, రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మి నేని చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు, అంబళ్ల రాంబాబు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.