రైలు నిలయాన్ని అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:28 AM
జాతీ య రహదారికి ఆనుకొని ఉన్న హరిశ్చంద్రపురం రైలు నిలయం అభివృద్ధిపై దృష్టి సారించాలని కో రుతూ ఈ ప్రాంతవాసులు కేంద్ర, రాష్ట్ర మంత్రు లు రామ్మోహన్‌నాయుడు, అచ్చె న్నాయునును కోరారు.
కోటబొమ్మాళి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జాతీ య రహదారికి ఆనుకొని ఉన్న హరిశ్చంద్రపురం రైలు నిలయం అభివృద్ధిపై దృష్టి సారించాలని కో రుతూ ఈ ప్రాంతవాసులు కేంద్ర, రాష్ట్ర మంత్రు లు రామ్మోహన్‌నాయుడు, అచ్చె న్నాయునును కోరారు. ఈ మేరకు శనివారం వారిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. తిలారు రైల్వే స్టేషన్‌లో బ్ర హ్మపూర్-విశాఖ సర్వీసుకు సంబంధించి నూతన హోల్ట్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రపురం రైల్ నిలయం ప్రయాణికుల విన్నపం మేరకు గుణుపూర్ ఎక్స్ ప్రెస్, పాసింజర్, భువనేశ్వర్-విశాఖ ఇంటర్‌సిటీ, పూరీ- తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ సర్వీ సులను హరిశ్చంద్రపురం స్టేషన్ లో నిలుపుదల చేయాలని కోరారు. మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు స్పందించి అక్కడకు వచ్చిన డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్‌బోహ్రా తో మాట్లాడారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌కు ఆనుకొని 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, దీనిని రైల్వే గోదాం, రైల్వే ప్రొ టక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణానికి గాని, ఇత ర అభివృద్ధి పనులకు దానిని ఉపయోగించి ఈ ప్రాంత అభి వృద్ధికి కృషి చేయాలని ప్రయా ణికుల తరుపున విన్నవిం చారు. కార్యక్రమంలో హర్చిం ద్రపురం మాజీ సర్పంచ్ పూ జారి శైలజ , సత్యనా రాయణ తదితరులు ఉన్నారు.
వజ్రపుకొత్తూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఎం తో చరిత్ర కలిగిన సూమారు 50 గ్రామాలకు అను కూలమైన పూండి రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని టీడీపీ నాయకులు కోరారు. శనివారం వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా పూండి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. విషయం తె లుసుకున్న అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, టీడీపీ మండల ప్రధాన కార్య దర్శి కర్ని రమణ స్థానికులతో డీఆర్‌ఎం కలిసి విన తి పత్రం అందించారు. పూండి రైల్వే స్టేషన్‌లో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే నిలుపుద చేస్తు న్నారని, దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌కు తగిన గుర్తింపునివ్వాలని కోరారు. ప్రధానంగా వి శాఖ, ప్రశాంతి, పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపా టు బ్రహ్మపూర్, భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైళ్లను నిలుపుదల చేయాలని కోరారు. పూండి రైల్వేస్టేషన్ అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. వెంకటరావు, గణేష్, మోహనరావు తదితరులు ఉన్నారు.