పంట నష్టం వివరాలు నమోదు చేయాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:02 AM
తుఫాన్ వల్ల ముంపునకు గురై నష్టం జరిగిన పంటల వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయాధికా రులను సూచించారు. ఆదివారం సంతబొమ్మాళి మం డలంలోని బోరుభధ్ర, కొల్లిపాడు, లక్కీవలస, మరు వాడ, మేఘవరం, కె.లింగూడు, కూర్మనాధపురంల్లోని ముంపు వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భం గా రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. వేల ఎకరాలు ముంపు బారిన పడ్డాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు కలెక్ఠర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయనతోపాటు తహ సీల్దార్ హేమసుందరరావు, ఏవో ఆర్. అప్పారావు, ఎంపీడీవో పార్వతీశం, డిప్యూటీ ఎంపీడీవో దుంప శ్రీనివాసరావు ఉన్నారు.
సంతబొమ్మాళి (కోటబొమ్మాళి), సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ వల్ల ముంపునకు గురై నష్టం జరిగిన పంటల వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయాధికా రులను సూచించారు. ఆదివారం సంతబొమ్మాళి మం డలంలోని బోరుభధ్ర, కొల్లిపాడు, లక్కీవలస, మరు వాడ, మేఘవరం, కె.లింగూడు, కూర్మనాధపురంల్లోని ముంపు వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భం గా రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. వేల ఎకరాలు ముంపు బారిన పడ్డాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు కలెక్ఠర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయనతోపాటు తహ సీల్దార్ హేమసుందరరావు, ఏవో ఆర్. అప్పారావు, ఎంపీడీవో పార్వతీశం, డిప్యూటీ ఎంపీడీవో దుంప శ్రీనివాసరావు ఉన్నారు.
ఫపోలాకి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తంపర ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతానని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. కోడూరు, సత్రవుపేట, సుసరాం, మగతపాడు, డోలలో తుఫాన్ వల్ల ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తంపర రైతులపై సమీక్షించారు. పోలాకి వంశధార కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, కలుపును యంత్రాలతో తొలగించాలన్న కలెక్టర్ ఆదేశాలతో తొలగింపు పనులు చేపట్టారు. తంపరలో ముంపునీరు తగ్గుముఖం పట్టిందని రైతులు తమ పొలాలకు ఉప్పుద్రావణం చల్లించాలని వ్యవసాయశాఖ ఏడీ వెంకటమధు సూచించారు. ఆయన వెంట పోలాకి మండల తుఫాన్ ప్రత్యేకాధికారి, సీఈఓ ఆర్.వెంకటరామన్, తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో బలగప్రకాష్, వ్యవసాయశాఖ ఏడీ మధు, డిప్యూటీ ఎంపీడీవో బి.పద్మావతి, తంపర రైతులు ఉన్నారు.
ఫజలుమూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) ముంపునకు గురైన పంట పొలాల్లో గల వరద నీటిని ప్రణాళిక బద్దంగా బయటకు మళ్లించాలని కలెక్టర్‌స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వంశధార అధికారులను ఆదేశించారు. మండలంలోని కరవంజ, తాళ్లవలస, గుగ్గిలి ప్రాంతాల్లో తుఫాన్‌ప్రభావం వలన పడిన భారీ వర్షాలకు నీటి మునిగిన పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన పంట పొలాల డ్రోన్ చిత్రీకరించిన ఫొటోలను పరిశీలించారు. ఏటా ముంపునకు గురైన పంటపొలాలు సంరక్షణకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని వంశధార అదికారులకు సూచించారు. వంశధార ఛానల్ ద్వారా సాగునీరందే ప్రాంతాలను మ్యాప్‌లో చూపించి ముంపునకు గురవడానికి కారణాలు వంశధార ఈఈ మురళీమోహనరావు కలెక్టరుకు వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్య, వంశధార ఈఈ మురళీమోహన్, డీఈలు శ్రీనివాసరావు, రామలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి జయంత్ ప్రసాద్, తహసీల్దారు జె.రామారావు, ఎంపిడివో బి.చిన్నమ్మడు, ఆర్.ఐ జగదీష్, మండల సర్వేయర్ తర్ర నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా అధికారులకు నష్ట నివేదిక
ఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలో తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు పాడైన రోడ్లు, కూరగాయల పంట లకు జరిగిన నష్టాలకు సంబంధించిన నివేదికలను సంబంధిత జిల్లా అధికారులకు పంపించినట్లు తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ తెలిపారు. మండ లంలోని కోవిలాం కాలనీవద్ద గోతులమయమైన అలికాం- బత్తిలి ప్రధానరోడ్డును, దబ్బపాడు, మిరియా పల్లి, ధనుకువాడ, తురకపేట తదితర గ్రామాల రోడ్లతో పాటు పంటపొలాలను ఆమె పరిశీలించారు.