Share News

వరదనీరు బయటకు పోయేలా పూడికతీత

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:10 AM

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గత అనుభవాల నేపథ్యంలో వరద నీరు సజావుగా బయటకు వెళ్లేలా కాలువల్లో పూడికలు తొలగించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆయన సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 వరదనీరు బయటకు పోయేలా పూడికతీత
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆకస్మిక తనిఖీ

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గత అనుభవాల నేపథ్యంలో వరద నీరు సజావుగా బయటకు వెళ్లేలా కాలువల్లో పూడికలు తొలగించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆయన సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో వర్షా లకు కాంప్లెక్స్‌ పూర్తిగా జలమయమై కాంప్లెక్స్‌ ప్రాంగణం, ప్రజలు వేచి ఉండే స్థలం, ప్లాట్‌ఫారాలు, టిక్కెట్‌ కౌంటర్లు కూడా నీట మునిగి, ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా పక్కాగా ముందస్తు చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీ నీరు వెళ్లకపోవడమే ప్రధాన కారణమని, నీరు త్వరితగతిన బయ టకు పోయేలా పూడికతీత పనులు తక్షణం చేపట్టాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. అత్యవసర సమయంలో నీటిని బయటకు పంపించేందుకు భారీ మోటార్లను సిద్ధం చేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, డిపో మేనేజర్‌ అమరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండండి: అశోక్‌

కవిటి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెం దాళం అశోక్‌ సూచించారు. రామయ్యపుట్టుగలో సోమవారం ఇచ్ఛాపురం నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రత్యేకాధికారితో సమావేశం నిర్వహిం చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సము ద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

జాగ్రత్తలు తీసుకోవాలి: శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్రమ త్తంగా ఉండాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలకు ఇబ్బందు లు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - Sep 22 , 2026 | 12:10 AM