Share News

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించకుండా వారోత్సవాలకు రూపకల్పన చేయండి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:36 PM

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉండడం వల్ల నిబంధ నల ఉల్లంఘనలకు పాల్పడకుండా గ్రంఽథాలయ వారోత్సవాల కు రూపకల్పన చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్యన్‌ పీరుకట్ల విఠల్‌రావు కోరారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించకుండా  వారోత్సవాలకు రూపకల్పన చేయండి
మాట్లాడుతున్న విఠల్‌రావు:

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉండడం వల్ల నిబంధ నల ఉల్లంఘనలకు పాల్పడకుండా గ్రంఽథాలయ వారోత్సవాల కు రూపకల్పన చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్యన్‌ పీరుకట్ల విఠల్‌రావు కోరారు. వారోత్సవాలను ఘనంగా నిర్వ హించాలని సంస్థ సిబ్బందికి సూచించారు. మంగళవారం శ్రీకా కుళంలోని కేంద్ర గ్రంఽథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలకు సంబందించి సిబ్బందితో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14నుంచి 20వతేదీ వరకు జరిగే జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాలను ప్రజాప్రతినిధులు, పాఠకులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామవళి ముగిసిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేలా ప్రత్యేక పోటీలు, సాంస్కృతిక కార్య క్రమాలను రూపకల్పనచేసి విసృత ప్రచారాన్ని కల్పించాలని సూచించారు. వారోత్సవా ల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయింపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహా యసహకారాలు అందిస్తామని తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 11:36 PM