Share News

డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:46 PM

జిల్లాలో ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖా పరమైన (డిపార్ట్‌మెంట్‌)పరీక్షలు పక్కా గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు.

డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి
మాట్లాడుతున్న డీఆర్వో వి.విశ్వేశ్వరరావు

డీఆర్వో వి.విశ్వేశ్వరరావు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖా పరమైన (డిపార్ట్‌మెంట్‌)పరీక్షలు పక్కా గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో వివిధ శాఖల అధికారులతో సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని వసతు లు కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌, సంప్రదాయ విధానాల్లో జరిగే ఈ పరీక్షల కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల, శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, నరసన్నపేట కోర్‌ టెక్నాలజీస్‌ కేం ద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:46 PM