Share News

ఎంపీపీ విషయంలో మోసం

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:36 PM

ఎంపీపీ విషయంలో తనకు మోసం జరిగిందని కోష్ట ఎంపీటీసీ సభ్యుడు పిషిని జగన్నాథం నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.

ఎంపీపీ విషయంలో మోసం

కోష్ట ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథంనాయుడు

రణస్థలం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎంపీపీ విషయంలో తనకు మోసం జరిగిందని కోష్ట ఎంపీటీసీ సభ్యుడు పిషిని జగన్నాథం నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లా డుతూ.. ఎంపీపీ పదవి ఇస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లంక శ్యామలరావు హామీ ఇచ్చారని, ఆ హామీని నమ్మి 19 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశానన్నారు. అయితే చివరికి ఎంపీపీ విషయంలో మోసం చేశారన్నారు. కూటమి ధర్మాన్ని పాటించి ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ విజయానికి తన కుటుంబమంతా పాటుపడిందన్నారు. ఎంపీపీ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇన్‌చార్జి మంత్రి కొండ పల్లి శ్రీనివాసరావు, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి అరిమిల్లి రాధాకృష్ణ, పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున దృష్టికి తీసుకెళ్లానన్నారు. మొదటి రెండేళ్లు తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలని, లేకుంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని కోరినా శ్యామలరావు అంగీకరించ లేదన్నారు. పదవి, ఆర్థికంగా నష్టపోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు పైడి అప్పడుదొర, పిషిని అసిరినాయుడు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 11:36 PM