గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:19 AM
బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు.
సోంపేట రూరల్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. మృతుని వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. సుమారు ఐదు అడుగుల పొడవు కలిగి బ్లూకలర్ జీన్ ప్యాంట్, నలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. టీషర్ట్‌పై తెలుపు రంగులో షూపీకేఫ్ అనే అక్షరాలు ఉన్నాయని వివరించారు. బుధవారం రాత్రి వర్షం పడడంతో మృతదేహం ఉబ్బి ఉందన్నారు. పలాస జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే పలాస రైల్వే పోలీసులకు 94922 50069 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.