Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:19 AM

మహత్మాజ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్ర హరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది పడిఉన్నాడు.

   గుర్తుతెలియని వ్యక్తి మృతి

టెక్కలి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మహత్మాజ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్ర హరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది పడిఉన్నాడు. స్థానికు లు గుర్తించి పోలీసులకు సమా చారం ఇచ్చారు. అయితే మృతు డి మృతికి గల కారణాలు తెలి యరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాము పరిశీలించి కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నా రు. వివరాలు తెలిసినవారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

జలుమూరు (సారవకోట)/ ఎచ్చెర్ల, మార్చి 2(ఆం ధ్రజ్యోతి): సారవకోట మండలం అలుదు గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర(28) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అదే గ్రామానికి చెందిన అప్పలనా యుడుతో కలిసి నరేంద్ర ద్విచక్రవాహనంపై బంధువు ల పెళ్లి కార్డులు ఇచ్చేందుకు పర్లాకిమిడి వైపు వెళ్తుం డగా.. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘట నలో ద్విచక్ర వాహనం నడుపుతున్న నరేంద్ర తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంతో చికిత్స నిమిత్తం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్విచక్రవానం వెనుక కూర్చున్న అప్పలనాయుడుకు, ఆటోలో ఉన్న వరలక్ష్మికి గాయాలయ్యాయి. వీరిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంధువులకు సంబంధించిన పెళ్లికి చెప్పేం దుకు పర్లాకిమిడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా నరేంద్ర టెక్కలి ఆర్టీసీ గ్యారేజ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ఘటనలో కొయ్యాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Mar 03 , 2026 | 12:19 AM