ప్రాణం తీసిన నిద్రమత్తు
ABN , Publish Date - May 15 , 2026 | 12:21 AM
Van hits divider and lorry నిద్రమత్తు.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వేకువజాము వేళ.. ఓ వ్యాన్.. డివైడర్‌ను, ఆపై లారీని ఢీకొంది. నందిగాం మండలం కొండతెంబూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఒడిశావాసులు దుర్మరణం చెందారు.
డివైడర్‌ను, లారీని ఢీకొన్న వ్యాన్
ఇద్దరు ఒడిశావాసులు మృతి
కొండతెంబూరు వద్ద ప్రమాదం
నందిగాం, మే 14(ఆంఽధ్రజ్యోతి): నిద్రమత్తు.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వేకువజాము వేళ.. ఓ వ్యాన్.. డివైడర్‌ను, ఆపై లారీని ఢీకొంది. నందిగాం మండలం కొండతెంబూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఒడిశావాసులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన బొలేరో వ్యాన్ శ్రీకాకుళం నుంచి కూరగాయలతో ఇచ్ఛాపురం వైపు వెళ్తూ.. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నందిగాం మండలం కొండతెంబూరు సమీప జాతీయరహదారిపై డివైడర్‌ను ఢీకొంది. తర్వాత పలాస నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీని బలంగా ఢీకొనగా వ్యాన్‌డైవ్రర్ ఆర్తానాయక్(20) క్యాబిన్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిరంజన్ దొళాయి(67) తీవ్ర గాయాలకు గురయ్యాడు. లారీ పక్కకు ఒరిగిపోగా.. వ్యాన్‌నుజ్జనుజ్జయిపోయింది. స్థానికుల సమాచారం పోలీసులు, హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడు నిరంజన్ దొళాయిని టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వ్యాన్‌ను పక్కకు తొలగించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిరంజన్ దొళాయి కూడా మృతి చెందాడు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, మృతులిద్దరూ ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆర్తానాయక్‌ది గంజాం జిల్లా కరాచూలీ గ్రామం కాగా, నిరంజన్ దొళాయిది కొరాపుట్. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నందిగాం ఎస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ తెలిపారు.