నేటితో ఓటరు దరఖాస్తుల గడువు పూర్తి
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:45 PM
ముసాయిదా ఓటర్ల జాబితా పై ఫారం-6, 7, 8 దరఖా స్తులను అందిం చేందుకు గడువు గురువారం (10వ తేదీ)తో పూర్తి కానుందని ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలి పారు. ఈ మేరకు తన కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఆర్డీవో కె.సాయి ప్రత్యూష
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముసాయిదా ఓటర్ల జాబితా పై ఫారం-6, 7, 8 దరఖా స్తులను అందిం చేందుకు గడువు గురువారం (10వ తేదీ)తో పూర్తి కానుందని ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలి పారు. ఈ మేరకు తన కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతీ పౌరుడు తన పేరును ఓటరుగా నమోదు చేసుకోవా లన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బీఎల్‌ఏల ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేలా సహకరిం చాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, పీఎంజే బాబు(టీడీపీ), రౌతు శంకర రావు, ఐటీకుమార్, మురళీధర్ (వైసీపీ), కేవీఎల్‌ఎస్ ఈశ్వరి (కాంగ్రెస్), ప్రసాదరావు (బీజేపీ), భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
ఆమదాలవలస, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్వో ఎం.లావణ్య బుధవారం తహసీల్దార్ కార్యా లయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ, క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కా రం, ఓటర్ల మ్యాపింగ్‌లో వ్యత్యాసాలపై జారీ చేస్తున్న నోటీసులు, విచారణల షెడ్యూల్‌పై చర్చించారు. ఈ ప్రక్రియను నిబంధనల మేరకు ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఈఆర్వో తెలిపారు. సమావేశంలో ఏఈ ఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.