Share News

కోడలే.. కొడుకై..

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:03 AM

The woman who beheaded her uncle తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవడంతోపాటు.. చివరిదశలో తలకొరివి పెట్టడానికి కొడుకు ఉండాలని చాలా మంది అంటారు. కానీ కొడుకులు లేని లోటును తీర్చుతూ కుమార్తెలు, భార్య, అక్కచెల్లెళ్లు కూడా తలకొరివి పెట్టి మానవత్వం చాటుకుంటున్నారు.

కోడలే.. కొడుకై..
మామయ్యకు తలకొరివి పెడుత్ను కోడలు ఉమా

మామకు తలకొరివి పెట్టిన మహిళ

రణస్థలం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవడంతోపాటు.. చివరిదశలో తలకొరివి పెట్టడానికి కొడుకు ఉండాలని చాలా మంది అంటారు. కానీ కొడుకులు లేని లోటును తీర్చుతూ కుమార్తెలు, భార్య, అక్కచెల్లెళ్లు కూడా తలకొరివి పెట్టి మానవత్వం చాటుకుంటున్నారు. రణస్థలంలో ఓ కోడలు.. అన్నీ తానై మామకు తలకొరివి పెట్టి.. కొడుకు బాధ్యతలు తనపై వేసుకుని అంత్యక్రియలు పూర్తిచేసింది. కాపువీధికి చెందిన కరిమజ్జి రామప్పడు విద్యుత్‌శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఈయన భార్య చిన్నమ్మడు, కొడుకులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల కిందట మృతి చెందారు. అనారోగ్యంతో శుక్రవారం రాత్రి రామప్పడు కూడా మృతి చెందాడు. శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈయనకు తలకొరివి పెట్టేందుకు వారసులు లేకపోవడంతో కోడలు కరిమజ్జి ఉమా.. తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూపర్లకు కంటతడి తెప్పించింది.

Updated Date - Mar 01 , 2026 | 12:03 AM