Share News

కుమార్తెను ఆసుపత్రిలో చేర్పించి..

ABN , Publish Date - May 14 , 2026 | 12:38 AM

అల్లినగరం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

కుమార్తెను ఆసుపత్రిలో చేర్పించి..

  • స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం

  • అల్లినగరం జంక్షన్‌ వద్ద పెదరొంపివలస వాసి మృతి

ఎచ్చెర్ల, మే 13(ఆంధ్రజ్యోతి): అల్లినగరం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ జి.లక్ష్మ ణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లావేరు మండలం పెద రొంపివలస గ్రామానికి చెందిన మ హంతి తిరుపతిరావు(33) తన కుమార్తె ప్రియాంక కు అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో మంగళ వారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పిం చారు. ఆ రోజు రాత్రి అక్కడే భార్య సీతతో కలిసి ఉన్నారు. బుధవారం ఉదయం 8.30 గంటల సమ యంలో స్వగ్రామం వెళ్లేందుకు అల్లినగరం జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. తిరుపతిరావు ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 12:38 AM