ఆదమరిస్తే అంతే..
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:36 PM
మండలంలో ప్రధాన రహదారి పూండి ఆర్‌అం డ్‌బీ రోడ్డు కోతకు గురైంది.
- కోతకు గురైన పూండి రోడ్డు
-మరమ్మతులు చేపట్టని అధికారులు
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రధాన రహదారి పూండి ఆర్‌అం డ్‌బీ రోడ్డు కోతకు గురైంది. రోడ్డుకు ఇరువైపులా బెర్ములు దెబ్బతిన్నాయి. ఏమాత్రం ఆదమరిచి ప్రయాణం చేసినా ఇక్కడ ప్రమాదం బారిన పడకతప్పదు. బెండిగేటు జంక్షన్ నుంచి నౌపడ- టెక్కలి కలిపే ఈ రోడ్డుపై నిత్యం వందల సం ఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. సింగిల్ లైన్ రోడ్డు కావడంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకోలేక వాహనదారు లు ఇబ్బందులు పడుతుంటారు. రోడ్డు విస్తరణపై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నా రు. అయితే ఈలోపు కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ముఖ్యంగా రాత్రి వేళలో పూండి రోడ్డుపై ప్రయాణమంటేనే వాహన చోదకులు హడలిపోతున్నా రు. ముఖ్యంగా పూండి నుంచి బెండిగేటు జంక్షన్ వరకు వాహనాల రాకపో కలు అధికంగా ఉంటాయి. ఇటీవల ఓ యువకుడు ఈ రోడ్డుపై ట్రాక్టర్‌ను ఢీకొట్టి సంఘట స్థలం వద్దే మృతి చెందాడు. ఇప్పటికైనా కోతకు గురైన ప్రదేశంలో రోడ్డుకు ఇరువైపులా బెర్ములు వేయా లని ప్రయాణికులు కోరుతు న్నారు. రోడ్డు దుస్థితిపై ఆర్ అండ్‌బీ డీఈ రవికాంత్‌ను వివరణ కోరగా.. ‘పూండి రో డ్డు విస్తరణ పనులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైన వెంటనే పనులు చేపడతాం. ఈలోగా కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.