Share News

దళితుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:37 PM

దళితుల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం(ఏపీవీకేఎస్‌), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) నాయకులు ధర్నా నిర్వహించారు.

దళితుల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం

- కేవీపీఎస్‌, ఏపీవీకేఎస్‌ నాయకుల ధర్నా

కలెక్టరేట్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): దళితుల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం(ఏపీవీకేఎస్‌), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితవాడల్లో నేటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాల్లో దళితులకు శ్మశానవాటి కలు లేవని, తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బూర్జ మండలం అయ్యవారిపేటలో ఇంటింటికీ కొళాయిలు వేసి రెండేళ్లు కావస్తున్నా నేటికీ నీటి సౌకర్యం కల్పించలేదన్నారు. దళితవాడల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్తు లైట్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించడంతో పాటు ప్రతి కుటుంబానికీ రెండెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితుల సమస్యల పరిష్కారానికి, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.అమ్మ న్నాయు డు, ఉపాఽధ్యక్షులు నాగమణి, కేవీపీఎస్‌, ఏపీవీకేఎస్‌ నాయ కులు ఎం.సూర్యనారాయణ, సిర్ల ప్రసాద్‌, గంగరాపు సింహాచలం, కార్మిక సం ఘం నాయకులు జి.ఈశ్వరమ్మ, కె.ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:37 PM