Share News

నాన్నా.. సంబరాలకు వెళ్లొస్తానని చెప్పి..

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:34 AM

Two youths killed after crashing into an electric pole వజ్రపుకొత్తూరు మండలం చినతామాడవానిపేట గ్రామం సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇదే మండలం ఉద్దాన గోపినాథపురానికి చెందిన కర్ని కోదండరావు(28), గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ (23).. సైనూరులో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలకు ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో తిరిగి తమ ఊర్లకు బయలుదేరారు. చినతామాడవానిపేట గ్రామం వద్ద వీరి బైక్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

నాన్నా.. సంబరాలకు వెళ్లొస్తానని చెప్పి..
మణికంఠ, కోదండరావు మృతదేహాలు ఇన్‌సెట్‌లో.. (ఫైల్‌)

  • విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం

  • ఇద్దరు యువకుల దుర్మరణం

  • చినతామాడవానిపేటలో ప్రమాదం

  • ‘నాన్నా.. ఎంత రాత్రయినా త్వరగా ఇంటికి వచ్చేస్తాం. నువ్వు త్వరగా పడుకో’.. మణికంఠ తడ్రి గంగాధర్‌తో అన్న చివరి మాటలు ఇవి. ఆదివారం రాత్రి స్నేహితుడు కోదండరావుతో బైక్‌ మీద సంబరాలకు వెళ్లాడు. ఇద్దరూ ఆనందంగా గడిపారు. రాత్రి ఒంటిగంటకు బైక్‌ మీద ఇళ్లకు బయల్దేరారు. కొద్దిదూరం వచ్చేసరికి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

  • వజ్రపుకొత్తూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం చినతామాడవానిపేట గ్రామం సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇదే మండలం ఉద్దాన గోపినాథపురానికి చెందిన కర్ని కోదండరావు(28), గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ (23).. సైనూరులో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలకు ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో తిరిగి తమ ఊర్లకు బయలుదేరారు. చినతామాడవానిపేట గ్రామం వద్ద వీరి బైక్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో అటుగా వెళ్తున్న వారు.. వీరిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని.. మృతదేహాలను చూసి బోరున విలపించారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ నిహార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పలాసలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • మిన్నంటిన రోదనలు

  • మణికంఠ, కోదండరావు మృతితో ఇరు కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది. రోదనలు మిన్నంటాయి. గర్తం మణికంఠ నెల్లూరులో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. ఆదివారం రాత్రి.. ‘నాన్నా.. స్నేహితుడు కోదండరావుతో కలిసి సైనూరులో సంబరాలు చూసి వస్తాను’ అని చెప్పి... ఊహించని ప్రమాదంలో విగతజీవిగా మారాడంటూ తండ్రి గంగాధర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి, సోదరుడు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.

  • కోదండరావుది కూడా వ్యవసాయ కుటుంబమే. చిన్నచిన్న ప్రైవేటు పనులు చేసుకుంటూ జీవించేవాడు. తండ్రి మోహనరావు చాలా కాలం కిందట మృతి చెందాడు. తల్లి వరలక్ష్మి, అక్కతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కోదండరావు అకాల మృతితో తమకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు రోదించారు.

  • రాత్రివేళ పెద్ద శబ్దం

  • ‘ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఏదో ప్రమాదం జరిగిందని అనుకున్నాం. కానీ చీకటిలో తెలియలేదు. సోమవారం ఉదయాన్నే.. విద్యుత్‌ స్తంభం వద్ద ద్విచక్రవాహనం బోల్తాపడి.. ఇద్దరు విగతజీవులుగా కనిపించడంతో ఆందోళన చెందాం’ అని చినతామాడవానిపేట గ్రామస్థులు తెలిపారు. రోడ్డు వెడల్పు చిన్నది కావడంతో తరచూ రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 23 , 2026 | 12:34 AM