తుఫాన్ కల్లోలం.. అపార నష్టం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:25 AM
‘ఆర్నాబ్’ తుఫాన్ జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచింది. భారీ వర్షాలు, ఈదు రు గాలుల ధాటికి జిల్లావ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతి కొచ్చే దశలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జిల్లాలో 7,813 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
630 హెక్టార్లలో ఉద్యానం
సుమారు 20 వేల మంది రైతుల కంటకన్నీరు
శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి): ‘ఆర్నాబ్’ తుఫాన్ జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచింది. భారీ వర్షాలు, ఈదు రు గాలుల ధాటికి జిల్లావ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతి కొచ్చే దశలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు రూపొందించిన ప్రాథమిక నివేదికలు ఈ నష్ట తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంట లకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఆ వివరాలిలా ఉన్నాయి..
7 వేల హెక్టార్లకు పైగా వరికి...
వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక మేరకు.. జిల్లాలోని 26 మండలాల్లో ఉన్న 307 గ్రామాల్లో 7,813 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 18,174 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అత్యధికంగా 7,259 హెక్టార్లలో వరి పంటకే నష్టం వాటిల్లింది. ముఖ్యంగా సంతబొమ్మాళి మండలంలో రికార్డు స్థాయిలో 2903.7 హెకార్టలో వరి దెబ్బతింది. ఆ తర్వాత పోలాకిలో 486, జి.సిగడాంలో 427, ఇచ్ఛాపురంలో 398, జలుమూరులో 365.5, బూర్జలో 328.8, నరసన్నపేటలో 304.14 హెక్టార్ల లో వరి పంట నీట మునిగింది. అలాగే 459.5 హెక్టార్లలో మొక్కజొన్న, 94 హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న ప్రధానంగా జి.సిగడాం (339 హెక్టార్లు), లావేరు (107 హెక్టార్లు) మండలాల్లో దెబ్బతినగా, పత్తి పంట లావేరు (93 హెక్టార్లు) మండ లంలో ఎక్కువగా నష్టపోయింది. వరి పంట ప్రస్తుతం పిలకలు వేసే దశలో ఉండగా.. మొక్కజొన్న గింజల దశ లో దెబ్బతినడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యాన పంటలకు రూ. 17.50 కోట్లు..
ఉద్యానవన శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. జిల్లాలో ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం వాటి ల్లింది. 630.66 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన గా, 2,107 మంది రైతులు నష్టపోయారు. దాదాపు రూ. 17.50 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా అరటి పంట 382.14 హెక్టార్లలో నేలమట్టం కాగా 1,043 మంది రైతులు నష్టపోయారు. దీనివల్లే సుమారు రూ.11.46 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అలాగే 116.86 హెక్టార్లలో బొప్పా యి, 101.82 హెక్టార్లలో కూరగాయలు దెబ్బతిన్నా యి. ఇంకా 9 హెక్టా ర్లలో టమాటా, 8.44 హెక్టార్లలో బంతి, 5.36 హెక్టార్లలో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా 149 కొబ్బరి చెట్లు నేలకొరిగినట్లు సమాచారం.
ఉద్యాన పంటల్లో రణస్థలానికే నష్టం ఎక్కువ..
మండలాల వారీగా ఉద్యాన పంటల నష్టాన్ని పరి శీలిస్తే.. రణస్థలం మండలంలోనే అత్యధిక నష్టం వాటి ల్లింది. ఈ ఒక్క మండలంలోనే 263.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా, 797 మంది రైతులు నష్టపోయారు. ఆ తర్వాత లావేరు మండలంలో 87.16 హెక్టార్లు, కోటబొమ్మాళిలో 54.28, శ్రీకాకుళంలో 50.4, పొందూరులో 45.6, గారలో 38.8 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం సకాలంలో స్పందించి నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని జిల్లా రైతులు వేడుకుంటున్నారు. ఉద్యాన పంటలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రూ. 1.97 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి వాస్తవ నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని, పెట్టు బడి రాయితీలను సత్వరమే విడుదల చేయాలని అన్న దాతలు కోరుతున్నారు.