Share News

తుఫాన్‌ బీభత్సం

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:44 AM

జిల్లాలో ‘ఆర్నవ్‌’ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. బుధవారం ఉ దయం నుంచి భారీ వర్షాలు కురుస్తు న్నాయి. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి.

 తుఫాన్‌ బీభత్సం
జలుమూరు: పాగోడు వద్ద నీట మునిగిన వరిచేను

ఉప్పొంగిన నదులు.. జిల్లా జలమయం

ఎక్కడికక్కడే తెగిపడిన విద్యుత్‌ తీగలు

నీట మునిగిన పంటపొలాలు

జిల్లాలో తీరం దాటిన ‘ఆర్నవ్‌’

మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు

నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు

శ్రీకాకుళం, సెప్టెంబరు 23(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ‘ఆర్నవ్‌’ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. బుధవారం ఉ దయం నుంచి భారీ వర్షాలు కురుస్తు న్నాయి. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తు ఫాన్‌ రక్షణ చర్యలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వర రెడ్డి, అధికార బృందాలు పరిశీలించా యి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌టీ ఎఫ్‌ బృందాలు జిల్లాలో నలుమూలల మకాం వేశాయి. సాగునీటి ప్రాజెక్టు ల్లోకి భారీగా వరద చేరుతోంది. నారా యణపురం ఆనకట్ట నుంచి ఆరు వేల క్యూసెక్కులు, నాగావళి నది నుంచిఆరు వేల క్యూసె క్కుల నీటిని విడిచిపెడుతున్నారు. బహుదా నది ఉప్పొంగి 17,862 క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తోంది. ఒడిశాలో వరదల కారణంగా గొట్టాబ్యారేజీలోకి 17,662 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా 19,012 క్యూసెక్కుల వంశధార నదిలోకి విడిచిపెడుతున్నారు. నందిగాం మండ లంలో వంశధార ఎడమప్రధాన కాలువపై వం తెన కూలిపోవడంతో పలు గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు పట్టణా లు, గ్రామాలు జలమయమయ్యాయి. పంటపొ లాలు సరస్సులను తలపిస్తున్నాయి. సరబుజ్జిలి మండలం గురిడివలసలో పూరిల్లు కూలిపోయిం ది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

ఫ బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జిల్లా అంధకారంలోకి వెళ్లిపోయింది. టెక్కలి, ఎచ్చెర్ల, పలాస, లావేరు, పాతపట్నం, రణస్థలం, గార, సంతబొమ్మాళి, పొందూరు, జి.సిగడాం, పోలాకి తదితర మండలాల్లో 64 కరెంటు స్తంభాలు, 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ శాఖకు రూ. 9.24 లక్షల నష్టం వాటిల్లింది.

ఫ గురువారం వేకువజామున తుఫాన్‌ జిల్లాలోనే తీరం దాటిందని అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లాలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. గురువారం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్‌ సెలవును ప్రకటించారు. నదీ పరివాహక, సముద్ర తీరప్రాంతాల్లో కలెక్టర్‌, అధికారులు పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత మండలాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. బుధవారం రాత్రి ఆయన ఎచ్చెర్ల, రణస్థలం, గార, పోలాకి, సంతబొమ్మాళి మండలాల ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు, వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, రేకుల ఇళ్లు, కచ్చా ఇళ్లల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. విద్యుత్తు, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. పరిస్థితి చేయి దాటితే జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు తక్షణమే సమాచారం అందించాలని అన్నారు.

ముంపు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ:ఎస్పీ

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి తుఫాన్‌ పునరావాస కేం ద్రాలకు తరలించాన్నారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేయాలన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌(డయల్‌ 112)తో పాటు మూడు పోలీస్‌ సబ్‌డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కం ట్రోల్‌ రూమ్‌లు, స్పెషల్‌ బ్రాంచి కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచినట్టు ఎస్పీ తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 12:44 AM