జనసంద్రం.. మహేంద్రగిరులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:25 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా మందసకు సమీపంలోని తూర్పుకనుముల్లో రెండో ఎత్తైన (1501 మీటర్లు) పర్వతాలైన మహేంద్రగిరుల్లో వెలసిన పంచపాండవుల ఆలయాలకు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
హరిపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా మందసకు సమీపంలోని తూర్పుకనుముల్లో రెండో ఎత్తైన (1501 మీటర్లు) పర్వతాలైన మహేంద్రగిరుల్లో వెలసిన పంచపాండవుల ఆలయాలకు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాబకోట నుంచి దారి మొత్తం గత రెండు రోజులుగా భక్తుల రాకపోకలతో సందడిగా మారింది. ఽ పలాస, సోంపేట నుంచి ప్రత్యేకంగా 32 ఆర్టీసీ బస్సులు వేశారు. మందస ఎస్‌ఐ కె క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.