భక్తజన సంద్రం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:15 AM
అరసవల్లి ఆదివారం జనసంద్రమైంది.. మాఘమా సం ఆదివారం రథసప్తమి పడడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తరించారు.
శ్రీకాకుళం, అరసవల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) అరసవల్లి ఆదివారం జనసంద్రమైంది.. మాఘమా సం ఆదివారం రథసప్తమి పడడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తరించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత క్షీరాభిషేకాలు, తెలవారుజాము నుంచి సర్వ, ప్రత్యేక దర్శనాలు నిర్వహించారు. ఇంద్రపుష్క రిణి వద్ద మహిళలు పరమాన్నం వండి వెలుగుల రేడుకు సమర్పించి భక్తిని చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చె న్నాయుడు, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారా ణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు బగ్గు రమణ మూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు, విశాఖ ఐజీ గోపీనాథ్ జట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి మాజీ స్పీకర్ తమ్మినేని సీతా రాం దర్శించుకున్నారు. వీరితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వామివారి సేవలో తరించారు. వీరికి ఆలయ అర్చకులు స్వాగ తం పలికి ఆశీర్వచనం చేశారు. అసిరితల్లి అమ్మవారి ఆలయం వైపు నుంచి వచ్చిన రూ.100 దర్శన క్యూలై న్‌లోనే రూ.300, రూ.500 టిక్కెట్ తీసుకున్న భక్తుల ను కలిపేయడంతో వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పులి హోర, తాగునీరు, అన్న ప్రసాదం, మజ్జిగ, కూల్‌డ్రింక్స్ అందించాయి. దేవస్థానం తరపున లడ్డూలను పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి స్వామికి పుష్పాలంకరణ, ఏకాంతసేవ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు నిర్వహించారు.
అధికారుల కృషికి సత్ఫలితం: మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రథసప్తమి ఉత్సవాల్లో భక్తజన సంతృప్తే లక్ష్యంగా ఏర్పాట్లు చేశామని, అధికారుల కృషికి సత్ఫలితం లభించిందని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైభోవపేతంగా రథసప్తమి వేడుకలు ఈ ఏడాది జరిగాయని, రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం, ఆదివారం కావడంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మూడు నెలలుగా సమన్వయ కృషికి ఫలితం వచ్చిందన్నారు. ఏర్పాట్లపై భక్తజనం వ్యక్తం చేసిన సంతృప్తే ఇందుకు నిదర్వనమని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, నగర పాలక, దేవదాయ, ఆరోగ్య శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ వేడుకులను విజయవంతం చేశారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు.
అద్భుతంగా సౌకర్యాలు..
భక్తుల కోసం సౌకర్యాలను అధికారులు అద్భుతంగా కల్పించారు. దర్శనాలు జరుగుతున్న తీరు బాగుంది. అందరికీ నా అభినందనలు.
-కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
అందరి సహకారంతో ఉత్సవాలు..
అందరి సహకారంతో, సమన్వయంతో ఏడురోజుల రథసప్తమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాం. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసి, వారికి దర్శన ఏర్పాట్లు చేసాం. అన్ని సౌకర్యాలు కల్పించాం.
-గొండు శంకర్, ఎమ్మెల్యే, శ్రీకాకుళం
అరసవల్లి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం..
ఆదిత్యుని క్షేత్రం అరసవల్లిని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబా బు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ ఐదేళ ్ల పాలన లో హిందూ ఆచారాలు, సనాతన ధర్మంపై దాడులు అనేకం జరిగాయి. ప్రస్తుతం దానికి భిన్నంగా ప్రభుత్వం ధర్మాన్ని రక్షి స్తూ నవసమాజం కోసం పాటుపడుతోంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించడంపై జిల్లా ప్రజల తరపున ప్రభుత్వా నికి కృతజ్ఞతలు.
-కూన రవికుమార్, ఎమ్మెల్యే, ఆమదాలవలస