Share News

ఆరుతడి పంటలు వేసుకోవాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:02 AM

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురవడంతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, దీని దృష్ట్యా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను వేసకోవాలని జిల్లా రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు.

ఆరుతడి పంటలు వేసుకోవాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న శీనివాసరావు

కోటబొమ్మాళి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురవడంతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, దీని దృష్ట్యా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను వేసకోవాలని జిల్లా రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని తిలారులో వ్యవ సాయశాఖ, జిల్లా వనరులకేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)లో భాగం రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపుపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం ఆమదాలవ లస శాస్త్రవేత్తలు బి.జ్యోతిబసు, ఎం.శ్రీనివాసరావు, టెక్కలి ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరె క్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారి వై. సురేష్‌, ఏవో ఎస్‌.గోవిందరావు, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, ఏఈఓ డి. మధు కిరణ్‌, వీఏఏ ఎం.మాధవి పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:02 AM