Share News

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:39 PM

రాష్ట్రాన్ని ఐదేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాల్జేశారని, అయితే గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత సీపాన వెంకట రమణ, పార్టీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం అన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
మాట్లాడుతున్న రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌ రెడ్డి

రెండేళ్లలో రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి

రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా తదితరులు

ఇచ్ఛాపురం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఐదేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాల్జేశారని, అయితే గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత సీపాన వెంకట రమణ, పార్టీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై లేనిపోని విమర్శలు చేస్తే తగిన మూల్యంచెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ నాయ కులకు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌-6 హామీలను రెండేళ్లలో నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. వైసీపీ నేత పిరియా విజయమ్మకు టీడీపీ రాజకీయ భిక్ష పెడితే కష్టకాలంలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, డీఆర్‌ యూసీసీ సభ్యుడు శ్రీనివాసరౌలో, నేతలు సహదేవ్‌రెడ్డి, మేరుగు సూర్యనారా యణ, డి.కామేష్‌, పుల్లెట రాజు తదితరులు పాల్గొన్నారు.

‘కూటమి పాలనలో అందరికీ సంక్షేమం’

సోంపేట, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందుతున్నాయని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు శనివారం దున్న ప్రకాశ్‌, సంతోష్‌ పాణిగ్రాహి, చిత్రాడ శేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందన్నారు. ప్రతీనెల ఒకటో తేదీన పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, విద్యావ్య వస్థలో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెల్లి ధర్మారావు, మడ్డు రవి, బెల్లాన శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:39 PM