Share News

జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:58 PM

More advanced medical services శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ (క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం)ను విజయవాడ నుంచి వర్చువల్‌గా కేంద్ర వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖామంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబునాయుడు శనివారం వర్చవల్‌గా ప్రారంభించారు.

జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, తదితరులు

రూ.23.75 కోట్ల వ్యయంతో ఏర్పాటు

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం, కేంద్రమంత్రి

మరింత ఆధునిక వైద్యసేవలు: ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ (క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం)ను విజయవాడ నుంచి వర్చువల్‌గా కేంద్ర వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖామంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబునాయుడు శనివారం వర్చవల్‌గా ప్రారంభించారు. స్థానికంగా ఎమ్మెల్యే శంకర్‌ పాల్గొని.. శిలాఫలకాన్ని ఆవిష్కరించి.. ఆ భవనంతోపాటు ఆస్పత్రిలో ఆలా్ట్రసౌండ్‌ గదిని, లేబర్‌రూమ్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ.. ‘50 పడకల క్రిటికల్‌కేర్‌ బ్లాక్‌ అందుబాటులోకి రావడంతో 50శాతం మరణాల నివారణకు వీలు కలుగుతుంది. జీజీహెచ్‌లో 25 ఐసోలేషన్‌ పడకలతోపాటు డయాలసిస్‌, రెండు ఆపరేషన్‌ గదులు, క్యాథ్‌లాబ్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలో వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభిస్తాం. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందజేయనున్నామ’ని తెలిపారు. జీజీహెచ్‌ అభివృద్ధి కమిటీ సభ్యులు అందవరపు సంతోష్‌కుమార్‌, రెడ్డి గిరిజా శంకర్‌, ఉమామహేశ్వరి,బలివాడ ప్రసాద్‌, నాగేంద్రను సన్మానించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ జి.సౌమిని, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ అప్పలనాయుడు, జేడీ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు, స్టాప్‌నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

జీజీహెచ్‌ను మోడల్‌గా అభివృద్ధి చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

జీజీహెచ్‌ను మోడల్‌ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శనివారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యసేవలను మరింత మెరుగుపరచాల్సి ఉందన్నారు. మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు సమకూర్చడానికి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జీజీహెచ్‌తోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ఏరియా ఆస్పత్రులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:58 PM