మనసు పెట్టి.. మట్టితో చేసి..
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:45 AM
పర్యావరణ హితంగా వినాయకచవితి పండుగను జరుపుకోవాలన్న లక్ష్యంతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బుజ్జా యిల చేతుల్లో.. బొజ్జ గణపయ్య’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.
అరసవల్లి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): పర్యావరణ హితంగా వినాయకచవితి పండుగను జరుపుకోవాలన్న లక్ష్యంతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బుజ్జా యిల చేతుల్లో.. బొజ్జ గణపయ్య’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. శ్రీకాకుళం అరసవలి రోడ్డులోని ఎల్ ఎన్ గ్రీన్స్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం 500 మంది చిన్నా రులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. తొ లుత మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కార్యక్రమం ప్రధాన సాన్సర్లు అయిన బీజేపీ నేత, రవితేజ డెవలపర్స్ అధినేత పోకతోట సింహాచలం, జీఎన్ జ్యూయలర్స్ యజమాని గుడ్ల గౌతమ్, ఆంధ్రజ్యోతి మేనేజర్ సోమశంకర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థుల వద్ద కూర్చుని.. వారితో మాట్లాడి..
కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విద్యార్థుల వద్ద కూర్చుని.. మట్టి ప్రతిమల తయారీ ఉపయో గాలను, విశిష్టతను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి మరిన్ని వివరాలను రాబట్టారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగా హన కల్పించారు. విద్యార్థులు చక్కని అవగాహనతో మార్గనిర్దేశకులుగా ముం దుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం శిక్షకులు లక్ష్మీనారాయణ విద్యార్థు లకు వినాయక ప్రతిమ తయారీపై అవగాహన కల్పించారు. ప్రతిమ ఎలా తయారుచేయాలో స్వయంగా చేసి చూపించారు. కార్యక్రమానికి స్పాన్సర్లు గా న్యూ సెంట్రల్ స్కూల్ శ్రీకాకుళం, ఆనందసాయి స్వీట్‌హోం అండ్ బేకరీ, బీజీఆర్ ఫౌండేషన్, శ్రీ విజయ వేంకటేశ్వర జ్యూ యలర్స్, క్వాలిటీ మార్ట్ శ్రీకాకుళం, పీవీఎస్ రామ్మోహనరావు ఫౌండేషన్ దవళపేట, అర్కాయ హెల్త్ సెంటర్ శ్రీకాకుళం, వి-డెంటల్ కేర్ శ్రీకాకుళం వ్యవహరించారు.
- 500 మంది పైగా చిన్నారులు పాల్గొన్న ఈ మహా న్నత కార్యక్రమాన్ని అతిథులు అభినందించారు. ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్ కృషిని కొనియాడారు. ఇందులో అత్యుత్త మ ప్రతిభ చాటిన 10 మంది చిన్నారులను ఎంపిక చేశారు. వీరిలో ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థిని ఎస్.చేతన (10వ తరగతి) ప్రథమ బహుమతి.. పిల్లవలస జడ్పీ ఉ న్నత పాఠశాల విద్యార్థిని పి.నాగమణి ద్వితీయ బహు మతి.. పిల్లలవలస జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.గో విందమ్మ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. మిగి లిన ఏడుగురికి అతిథులు బహుమతులు అందజేశారు.
- కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి పి.బయపరెడ్డి, స్టాఫ్ రిపోర్టర్ టి.సురేష్‌బాబు, యాడ్స్ మేనేజర్ ఉమా, డిప్యూటీ సర్క్యులేషన్ మేనేజర్ అనంత్‌తో పాటు విస్సు, కృష్ణ మూర్తి పాల్గొ న్నారు.
భావితరాలకు ఎంతో ఉపయోగకరం
పర్యావరణహితంగా పండుగను జరుపు కునేందుకు విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి, విశిష్టతను వారికి వివరించి, అవగాహన కల్పించడం నిజంగా గొప్ప విషయం. ఇది భావితరాలకు ఎంతో ఉపయోగం. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చేస్తున్న కృషి అభినందనీయం.
- గుండ లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్యే
భాగస్వామి కావడం ఆనందంగా ఉంది
మట్టివినాయక ప్రతిమల తయారీ కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలకు కచ్చితంగా అం డగా ఉంటాము.
- గుడ్ల గౌతమ్, జీఎన్ జ్యూయలర్స్
కాలుష్యరహిత సమాజం కావాలి
కాలుష్యరహిత సమాజాన్ని అందించ డమే లక్ష్యం కావాలి. చిన్నారులు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలి. స్వచ్ఛమైన ప్ర కృతిని పెంపొందించేందుకు కృషి చేయాలి.
- పోకతోట సింహాచలం, బీజేపీ నేత