బీటలు వారి.. చెట్టు కొమ్మలు కూలి
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:36 PM
మండలంలోని సైలాడ పంచాయతీ పరిధిలోగల బంజీరుపేటలోని ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదకరంగా మారింది. బీటలు వారి శిథిలావస్థకు చేరడంతోపాటు ఇటీవల ఈదురుగాలులు, వర్షానికి చెట్టుకొమ్మలు పడిపోయాయి. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 14 మంది విద్యనభ్యసిస్తున్నారు.
నందిగాం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని సైలాడ పంచాయతీ పరిధిలోగల బంజీరుపేటలోని ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదకరంగా మారింది. బీటలు వారి శిథిలావస్థకు చేరడంతోపాటు ఇటీవల ఈదురుగాలులు, వర్షానికి చెట్టుకొమ్మలు పడిపోయాయి. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 14 మంది విద్యనభ్యసిస్తున్నారు. భవనం బీటలు వారడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీంట్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ప్రాణహాని ఉంటుందని తల్లిదండ్రులు, గ్రామపెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలు తిరిగి ప్రారంభించే నాటికి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా ప్రధానోపాధ్యాయులు సీహెచ్ ఉమాబాబు ఇటీవల పాఠశాలను సందర్శించి విషయాన్ని ఎంఈవో-2 జె.చిన్నారావు దృష్టికి తీసుకువెళ్లారు.