సూదికొండకాలనీలో కార్డన్సెర్చ్
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:05 AM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో సూదికొండకాలనీలో కాశీబుగ్గ సీఐ అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
పలాస, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో సూదికొండకాలనీలో కాశీబుగ్గ సీఐ అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అన్ని ఇళ్ల వద్ద అనుమానితులను ప్రశ్నించడంతో పాటు వాహనాలు తనిఖీ చేసి సంబంధిత పత్రాలు లేకపోతే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐ దుర్గాప్రసాద్తో పాటు పోలీసులు పాల్గొన్నారు.