కూటమి నేతల ఆత్మీయ సమావేశం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:50 PM
విజయనగరం పార్లమెంటరీ టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వగృహంలో ఆదివారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగింది.
విజయనగరం ఎంపీ కలిశెట్టి స్వగృహంలో సహపంక్తి భోజనం
రణస్థలం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పార్లమెంటరీ టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వగృహంలో ఆదివారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, రాజాం, విజయనగరం, బొబ్బిలి ఎమ్మెల్యేలు కోండ్రు మురళీ మోహన్, అదితి గజపతిరాజు, బేబీనాయన, ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పాటు పడాలని నిర్ణయించారు. అనంతరం సహ పంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, జనసేన ఇన్‌చార్జి విష్వక్సేన్ పాల్గొన్నారు.