Share News

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌వైర్లు చోరీ

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:04 AM

స్థానిక ఉదయపురం శివారులో ము న్సిపాలిటీ తాగునీటి పథకం వద్ద ఏ ర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లోని కాపర్‌ వైర్లు చోరీకి గురయ్యా యి.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌వైర్లు చోరీ
ట్రాన్స్‌ఫార్మర్‌ విరగ్గొట్టి కాపర్‌వైర్లను దొంగిలించిన దృశ్యం

  • మునిసిపాలిటీలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది

  • రూ.3 లక్షల వరకు నష్టం

పలాస, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఉదయపురం శివారులో ము న్సిపాలిటీ తాగునీటి పథకం వద్ద ఏ ర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లోని కాపర్‌ వైర్లు చోరీకి గురయ్యా యి. వీటి విలువ రూ.3 లక్షల వర కూ ఉంటుందని అధికారులు చెబు తున్నారు. అధికారులు తెలిపిన వివ రాల మేరకు.. ఐదో నెంబరు బావికి సంబంధించి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ను మున్సిపల్‌ నిధులతో ఏర్పాటు చేయించారు. ఇందులోని కాపర్‌ వైర్‌ చోరీ జరగడంతో తాగునీటికి విఘాతం కలిగింది. ప్రస్తుతం ఉద్దానం రక్షిత నీటి పథ కం ద్వారా నీరు సరఫరా కావడంతో బావిలో నీటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్దానం నీరు పూర్తిగా నిలిచిపోతే బావినీరు వినియోగించేందుకు దీన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో దొంగలు ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకి దించి అందులో ఉన్న రాగి వైర్లను దొంగిలించారు. బుధవారం ఉదయం ఆ ప్రాంత రైతులు ఈ చోరీ విషయాన్ని మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. ఏఈ కిరణ్‌ కుమార్‌, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఈ తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 01:04 AM