Share News

అర్హతే ప్రాతిపదికగా సహకారం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:16 PM

అర్హతే ప్రాతిపదికగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

 అర్హతే ప్రాతిపదికగా సహకారం
చెక్కును అందజేస్తున్న ఎంజీఆర్‌:

పాతపట్నం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): అర్హతే ప్రాతిపదికగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాల యంలో ముగ్గురు బాధితులకు రూ.2,35,819 మొత్తానికి సంబంధించి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆదివారం అందజేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కొత్తూరు మండలం దిమిలి గ్రామానికి చెందిన సాగర్‌బాబుకు రూ.1,04,157, మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ముంగి నారాయణకు రూ.95,012, భరణికోటకు చెందిన పాలవలస ఈశ్వరరావుకు రూ.36,650 చెక్కులను అందజేశారు.

Updated Date - Feb 01 , 2026 | 11:16 PM