Share News

సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:42 PM

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌)కు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌)కు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఈఆర్వో జె. లావణ్య అధ్యక్షతన వివిధ పార్టీల నాయకులు, బీఎల్వోలు, బీఎల్‌ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ.. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు గ్రామాల్లో నిర్వహించనున్న సర్‌ సర్వే కార్యక్రమంలో అధికారులతో పాటు అన్ని పార్టీల బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు పాల్గొని తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. బీఎల్వోలు ఓటర్ల చేర్పులు, మా ర్పులు, తొలగింపులు ఇతర అంశాలపై వచ్చే అభ్యంతర దరఖాస్తులపై గ్రామాల్లోనే సమగ్ర విచారణ చేసి తదుపరి నివేదికలు రూపొందిం చాలన్నారు. ఏఆర్వో వెంకటేశ్వరరావు సర్‌ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవి కుమార్‌, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు, పట్టణ అధ్యక్షు డు ఎస్‌.మురళీధర్‌, పొందూరు పీఏసీఎస్‌ అధ్య క్షుడు వండాన మురళి, సరుబుజ్జిలి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తులగాపు ధనుంజయరావు ఓటర్ల సర్వేలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఇతర అధికారులు టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:42 PM