ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:17 AM
: మునిసిపల్ ఎన్నికలు ఈనెల 26న జరగనున్న నేపథ్యంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకా కుళం డీఎస్పీ సీహెచ్ ధనుంజయ నాయుడు కోరారు.
డీఎస్పీ ధనుంజయనాయుడు
ఆమదాలవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలు ఈనెల 26న జరగనున్న నేపథ్యంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకా కుళం డీఎస్పీ సీహెచ్ ధనుంజయ నాయుడు కోరారు. మునిసి పల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీ సుల మూడంచెల విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశా రు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులను సక్రమం గా నిర్వహించాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఎటు వంటి అడ్డంకులు కల్పించకుండా, ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ఆయనతో పాటు సీఐ ఎం.సన్యాసినాయుడు, ఎస్‌ఐ సనపల బాలరాజు తది తరులున్నారు.
ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి
కమిషనర్ శ్రావణ్‌కుమార్
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సభలు, ర్యాలీలు, ప్రచారాలకు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని కమిషనర్ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమా లు నిర్వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు, అత్యవసర సేవలకు ఇబ్బం దులు కలగకుండా ప్రచారం నిర్వహించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసుకోండి
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పోలింగ్‌స్టేషన్ వివరా లను ముందుగానే తెలుసుకోవాలని కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వెబ్ సౖట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పోలింగ్ కేంద్రం వివరాలు తెలు సుకోవచ్చన్నారు. ఇందుకోసం జిల్లా, నగరపాలక సంస్థ వివరాలు ఎంపిక చేసి, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్, క్యాప్చా నమోదు చేసి సెర్చ్ చేయాలన్నారు. ఓటర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఎన్నికల రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటుహక్కును వినియోగించు కోవాలని సూచించారు.