కూల్‌డ్రింక్స్ వ్యాన్ బోల్తా
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:25 AM
జాతీయ రహదారి హరిశ్చంద్రపురం జంక్షన్ సమీపంలో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో భువనేశ్వరం నుంచి విశాఖవైపు వెళ్తున్న కూల్‌డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది.
కోటబొమ్మాళి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి హరిశ్చంద్రపురం జంక్షన్ సమీపంలో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో భువనేశ్వరం నుంచి విశాఖవైపు వెళ్తున్న కూల్‌డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. డ్రైవర్ నిద్రాలేమితో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచుసుకుంది. దీంతో కూల్‌డ్రింక్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. హైవే సేఫ్టీ సిబ్బంది, హైవే పెట్రోలింగ్ సిబ్బంది చేరుకుని బోల్తా పడిన వ్యాన్‌ను క్రేన్ సాయంతో రోడ్డు పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ వ్యాన్‌లో ఉన్న డైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.