ఆలయ ప్రహరీ నిర్మాణంలో వివాదం
ABN , Publish Date - May 20 , 2026 | 11:58 PM
రామయ్యపట్నంలో దశాబ్దాలు గా గ్రామస్థులు పూజిస్తున్న వరసండి అమ్మవారి ఆలయ ప్రహరీ నిర్మిస్తుం డగా బుధవారం అటవీశాఖ అధికా రులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరి గింది.
గ్రామస్థులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం
సోంపేట రూరల్, మే 20 (ఆంధ్ర జ్యోతి): రామయ్యపట్నంలో దశాబ్దాలు గా గ్రామస్థులు పూజిస్తున్న వరసండి అమ్మవారి ఆలయ ప్రహరీ నిర్మిస్తుం డగా బుధవారం అటవీశాఖ అధికా రులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరి గింది. వివరాలిలా ఉన్నాయి.. వరసండి అమ్మవారి ఆలయానికి చుట్టూ ప్రహరీ నిర్మా ణానికి బుధవారం పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ ప్రత్యేకాధి కారి బిందు, గొల్లగండి బీట్ ఆఫీసర్ సంతోష్ అక్కడికి చేరు కుని ఇది అటవీ భూమి అని, ఇందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడ దన్నారు. అయితే దీనికి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దశాబ్దాలుగా ఇక్కడ గుడి ఉంద ని, దీనికి ప్రహరీ నిర్మాణానికి గ్రామస్థు లంతా కలిసి నిర్ణయం తీసుకుని పనులు చేపట్టామని, అడ్డుకునే హక్క మీకు లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వా దం ఏర్పడింది. ఈ సమస్య ఎమ్మె ల్యే బెందాళం అశోక్ దృష్టికి వెళ్లిందని, ప్రహరీ నిర్మాణానికి అడ్డు తగలడం సమంజసం కాదని ఎమ్మెల్యే అటవీ అధికారు లకు తెలిపారని ఎంపీటీసీ మాజీ సభ్యుడు నిట్ట గోపాల్, వి.కృష్ణా రావు, బి.ఎర్రయ్య పేర్కొన్నారు. గ్రామస్థుల నుంచి వ్యతిరేకత పెరగడంతో అటవీ అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమం లో నీలవేణి, దుర్గ, లోకనాఽథం, రమణ, పలు వురు గ్రామస్థులు పాల్గొన్నారు.