ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సహకరించండి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:03 AM
ఎయిర్ పోర్టు నిర్మాణానికి రైతులు సహకరించాలని డిప్యూటీ కలెక్టర్లు వేణుగోపాల్, జయదేవి కోరారు. మంగళవా రం మండలంలోని మోట్టూరు పంచాయతీలోగల ఒం కులూరు, చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో రైతులతో మాట్లాడారు. భూములు అప్పగించేందుకు ఉన్న సమస్యలను రైతులు అడిగి తెలుసుకున్నారు.
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఎయిర్ పోర్టు నిర్మాణానికి రైతులు సహకరించాలని డిప్యూటీ కలెక్టర్లు వేణుగోపాల్, జయదేవి కోరారు. మంగళవా రం మండలంలోని మోట్టూరు పంచాయతీలోగల ఒం కులూరు, చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో రైతులతో మాట్లాడారు. భూములు అప్పగించేందుకు ఉన్న సమస్యలను రైతులు అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. భూములిచ్చే రైతులకు పరిహారం ఇవ్వడమే కాకుండా కొంత విలువైన భూమిని అప్ప గిస్తామన్నారు. యువతకు ఉపాధిఅవకాశాలు కల్పించ డానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో మరిన్ని కంపెనీలు ఈప్రాంతంలో ఏర్పా టుచేసే అవకాశముందని, దీంతో అభివృద్ధి ఫలాలు మెరుగుపడి తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల ఏ ఒక్క గ్రామం తొలగిం చబోమని తెలిపారు. డిమాండ్లు కమిటీ ముందు, పరిహారంపై అనుమానాలు ఉంటే అధికారులు ముం దు వెల్లడించాలని కోరారు. అనంతరం రైతులు మాట్లా డుతూ మాకు వ్యవసాయం తప్ప ఏమి తెలియదని, భూములు తీసుకుంటే ఏవిధంగా బతికేదని అధికా రుల ఎదుట వాపోయారు. దీంతో అధికారులు రైతుల కు సర్ధిచెప్పె ప్రయత్నంచేశారు. అనకాపల్లిలో పరిధిలో పారెస్టు, డిల్యాండ్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని రైతులు అధికారులకు స్పష్టం చేశా రు. ఈవిషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సీతారామ్మూర్తి పాల్గొన్నారు.