Share News

తీర ప్రాంత రక్షణకు సహకరించండి

ABN , Publish Date - May 22 , 2026 | 11:53 PM

సముద్రతీర ప్రాంత రక్షణకు, అక్రమ రవాణా నివారణకు సహకరిం చాలని మెరైన్‌ సీఐ రమేష్‌ అన్నారు.

 తీర ప్రాంత రక్షణకు సహకరించండి
సోంపేట రూరల్‌: మాట్లాడుతున్న మెరైన్‌ సీఐ రమేష్‌

మెరైన్‌ సీఐ రమేష్‌

సోంపేట రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): సముద్రతీర ప్రాంత రక్షణకు, అక్రమ రవాణా నియంత్రణకు సహకరిం చాలని మెరైన్‌ సీఐ రమేష్‌ అన్నారు. ఎర్ర ముక్కాంలో వివిధ అంశా లపై మత్స్యకారులకు అవగాహన కలిగించారు. సముద్రమార్గంలో స్మగ్లర్లను అడ్డుకునేందుకు గాను అనుమాని తులు కనిపిస్తే వెంటనే సమా చారం ఇవ్వాల న్నారు. కార్యక్రమంలో మెరైన్‌ పోలీసు సిబ్బంది దాలినాయుడు, హేమసుందర్‌, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

మూసవానిపేటలో పల్లెనిద్ర

ఎచ్చెర్ల, మే22(ఆంధ్రజ్యోతి): మూసవానిపేట లో మెరైన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి కమ్యూ నిటీ అవుట్‌ రీచ్‌లో భాగంగా కళింగపట్నం మెరైన్‌ ఎస్‌ఐ జి.హరికృష్ణారావు పల్లెనిద్ర చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చేపల వేట నిషేధం అమల్లో ఉన్నం దున మత్స్యకారులు మరబోట్లలో వేటకు వెళ్ల వద్దన్నారు. అనుమానిత, అపరిచిత వ్యక్తులు సంచరించినా, మాదక ద్రవ్యాల వినియోగం, బాలికల అక్రమ రవాణాకు సంబంధించి ఎలాం టి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయా లన్నారు. ఎటువంటి సమాచారం ఉన్న కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1093, కళింగపట్నం స్టేషన్‌ 93929 14712 నెంబరుకు తెలియజేయాలన్నారు.

Updated Date - May 22 , 2026 | 11:53 PM