Share News

కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:12 AM

జిల్లాలో వైద్యఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు బుధవారం నుంచి అత్యవసర విధులను కూడా బహిష్కరించారు. మంగళవారం శ్రీకాకుళంలోని జీజీహెచ్‌లోని అత్యవసర విభాగాలను మినహాయిం చి అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టగా బుధవారం అత్యవసర విధులను కూడా బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఆవ రణలో రెండోరోజూ కూడా ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

 కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
అత్యవసర విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

శ్రీకాకుళంకల్చరల్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్యఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు బుధవారం నుంచి అత్యవసర విధులను కూడా బహిష్కరించారు. మంగళవారం శ్రీకాకుళంలోని జీజీహెచ్‌లోని అత్యవసర విభాగాలను మినహాయిం చి అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టగా బుధవారం అత్యవసర విధులను కూడా బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఆవ రణలో రెండోరోజూ కూడా ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ఏ, డీఏలతో కలిపి వందశాతం జీతాన్ని పునరుద్దంచాలని, 2018 నుంచి అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలని, భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలకు నియామక నోటిఫి కేషన్లు విడుదలచేసి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు నుంచి పలురీతుల్లో నిరస తెలియ జేస్తున్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో మంగళవారం నుంచి ప్రత్యక్ష చర్యకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌హెల్త్‌ కాంట్రా క్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ స్థానిక కమిటీ చైర్మన్‌ వేదవతీ లక్ష్మీబాయ్‌ మా ట్లాడుతూ తమకు న్యాయం జరిగేవరకు ఆందోళను విరమించే ప్రసక్తే లేదని తెలి పారు.బుధవారం నుంచి రిమ్స్‌లోని ఫిజియోఽథెరపీ విభాగం సిబ్బంది కూడా సమ్మెలో పాల్గోనడంతో ఆవిభాగం మూత పడింది. ఆ విభాగంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్ట్‌ డాక్టర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:12 AM