Share News

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:47 PM

సమస్యల పరిష్కారం వైద్య ఆరోగ్య శాఖ కాంట్రా క్ట్‌ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్క రించి ధర్నా నిర్వహించారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి
రిమ్స్‌ ఆవరణలో ధర్నా చేస్తున్న కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు

ఉద్యోగుల సంఘం జేఏసీ కమిటీ చైర్‌పర్సన్‌ లక్ష్మీబాయి

నేటినుంచి అత్యవసర సేవలూ బహిష్కరణ

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం వైద్య ఆరోగ్య శాఖ కాంట్రా క్ట్‌ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్క రించి ధర్నా నిర్వహించారు. రిమ్స్‌ ఆవరణలో జరి గిన ధర్నాలో ఏపీ మెడికల్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఉద్యో గుల జేఏసీ స్థానిక కమిటీ చైర్‌పర్సన్‌ వేదవతీ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. సమస్యలపై ఇప్పటి వరకు శాంతియుతంగా నిరసనలు చేపట్టామని, పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయకపోవడంతో ధర్నాకు దిగామన్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యో గులను రెగ్యులరైజ్‌ చేయా లని డిమాండ్‌ చేశా రు. రిమ్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.అశోక్‌ మాట్లాడుతూ.. తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకు ఇప్పటి వరకు శాంతి యుతంగా పోరాటం చేసినా ప్రభుత్వం న్యాయం చేయలేదని, అందువల్ల బుధవారం నుంచి అత్య వసర సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీఎన్‌ జీజీవో జిల్లా జేఏసీ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం సంఘీభావం తెలిపారు. శిబిరానికి వెళ్లి సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 06 , 2026 | 11:47 PM