పేదల సంక్షేమానికి నిరంతర కృషి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:42 PM
పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం నగరం లోని విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షల విలువైన సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకు నేందుకు ఇంతటి గొప్ప సాయం అందిస్తున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.