Share News

నిరంతరం ఆధార్‌ సేవలు

ABN , Publish Date - May 14 , 2026 | 12:17 AM

జిల్లాలోని సబ్‌ పోస్టాఫీసు ల్లో ఆధార్‌ బయోమెట్రిక్‌ సేవలను నిరంతరం అందిస్తున్నట్లు శ్రీకా కుళం తపాలాశాఖ సూపరింటెం డెంట్‌ హరిబాబు తెలిపారు.

నిరంతరం ఆధార్‌ సేవలు
పార్సిల్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న పోస్టల్‌ సూపరింటెండెంట్‌ హరిబాబు

ముఖ్య పోస్టాఫీసుల్లో పార్సిల్‌ ప్యాకింగ్‌ యూనిట్లు

పోస్టల్‌ సూపరింటెండెంట్‌ హరిబాబు

పొందూరు, మే 13 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని సబ్‌ పోస్టాఫీసు ల్లో ఆధార్‌ బయోమెట్రిక్‌ సేవలను నిరంతరం అందిస్తున్నట్లు శ్రీకా కుళం తపాలాశాఖ సూపరింటెం డెంట్‌ హరిబాబు తెలిపారు. స్థానిక సబ్‌ పోస్టాఫీసులో పార్సిల్‌ ప్యాకింగ్‌ యూనిట్‌ సేవలను బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నూతన ఆధార్‌ కార్డులతో పాటు ఆధార్‌ బయో మెట్రిక్‌ సేవల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించేం దుకు పోస్టాఫీసుల్లో ఆధార్‌ కేంద్రాలను తెరిచామన్నారు. బాల ఆధార్‌కార్డులతోపాటు బయో మెట్రిక్‌ సేవలు అందుతాయన్నారు. పిల్లల నూతన ఆధార్‌ కార్డు తయారీ లో మూడు దశల్లో ఒకసారి ఉచితంగా సేవలు అందిస్తా మన్నారు. ఉపాధి హామీ కార్మికులు తమ బయోమెట్రిక్‌ సేవలను పోస్టాఫీసుల్లో వినియోగించు కోవాలన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం జిల్ల్లాలో ఎక్కువ డిమాండ్‌ ఉన్న సోంపేట, రాజాం, నరసన్నపేట, టెక్కలి, పొందూరు తదితర పోస్టాఫీసుల్లో పార్సిల్‌ ప్యాకింగ్‌ యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని లో భాగంగా పోస్టాఫీసుల్లో అందించే పార్సిల్‌ యూని ట్లతో కస్టమర్ల పార్సిళ్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరు కుంటా యన్నారు. ప్రైవేటు కొరియర్‌ల కంటే మెరుగైన కొరియర్‌ సౌకర్యాన్ని పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని, వినియోగ దారులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో సబ్‌ పోస్టుమాస్టర్‌ ఎం.ఆనంద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:17 AM