Share News

ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కంటైనర్‌

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:17 AM

స్థానిక సత్యవరం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్‌ డ్రైవర్‌ షేక్‌ రుఫా (55) మృతి చెందారు.

ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కంటైనర్‌
వాహనాలను తొలగిస్తున్న దృశ్యం డ్రైవర్‌ షేక్‌ రూఫా (ఫైల్‌)

  • మృతి చెందిన డ్రైవర్‌

నరసన్నపేట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సత్యవరం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్‌ డ్రైవర్‌ షేక్‌ రుఫా (55) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదారి మధ్యలో మొక్కలకు నీరు పెడుతున్న ట్యాంకర్‌ సత్యవరం జంక్షన్‌ వద్ద నిలిపి ఉంచగా.. అదే మార్గంలో కటక్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ బలంగా ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ నడుపుతున్న షేక్‌ రూఫా తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్‌లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే షేక్‌ రుఫా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. షేక్‌ రుఫాకు భార్య హసీనా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్‌ఐ గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కంటైనర్‌ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉండిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైవే అధికారుల భారీ క్రేన్‌ సాయంలో కంటైనర్‌ను పక్కకు తొలగించారు. కాగా జాతీయ రహదారిపై వాహనాలు నిలపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ తరహా ప్రమాదాలను అరిక ట్టేందుకు హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:17 AM