చికిత్స పొందుతూ భవన నిర్మాణ కార్మికుడి మృతి
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:41 AM
భవన నిర్మాణం పనులు చేస్తుండగా మూడో అంతస్తు పరంజాపై నుంచి కింద పడిప కోరాడ శ్రీను (45) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణం పనులు చేస్తుండగా మూడో అంతస్తు పరంజాపై నుంచి కింద పడిప కోరాడ శ్రీను (45) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ కేవీ సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పొందూరు మండలం లక్ష్మంపేటకు చెందిన శ్రీను ఈనెల 20న రూరల్ మండల పరిధి ఏఎస్ కాలనీలో భవన నిర్మాణం పనులు చేస్తున్నాడు. మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన పరంజాపైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి కూలీలు 108లో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.