నిధులు విడుదలకాక.. నిర్మాణం సాగక
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:14 AM
వజ్రపుకొత్తూరులోని గ్రామ సచివాలయం నిర్మాణం నిధులు విడుదల కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. భవన నిర్మాణానికి సంబందించి కాంట్రాక్టరు పనులు ఆలస్యం చేయడం నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా పనులు పూర్తికా కుండా నిలిచిపోయాయి.
వజ్రపుకొత్తూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరులోని గ్రామ సచివాలయం నిర్మాణం నిధులు విడుదల కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. భవన నిర్మాణానికి సంబందించి కాంట్రాక్టరు పనులు ఆలస్యం చేయడం నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా పనులు పూర్తికా కుండా నిలిచిపోయాయి. అయితే ఇక్కడ సచివాలయం నిర్వహణకు మరో భవనం సదుపాయం లేకపోవడంతో సిబ్బంది సగం నిలిచిన భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్లాస్టింగ్‌లు కాకపోవడంతో వర్షాకాలంలో శ్లాబ్ నుంచి నీరుకారుతోందని సిబ్బంది చెబుతున్నారు. వజ్రపుకొత్తూరు, కిడిసింగి, శారధాపురం పంచాయతీలు వజ్రపుకొత్తూరు గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నాయి. మండల కేంద్రంలోని సచివాలయం కావడంతో నిత్యం ప్రజలు ఇక్కడకు పలు పనులపై వస్తుంటారు. అయితే భవనం పూర్తికాకపోవడం, సౌకర్యాలు లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం నిధులు విడుదలచేసిన వెంటనే మిగతా పనులు పూర్తిచేస్తామని పీఆర్ డీఈ ఎ.రవిబాబు చెప్పారు. గతంలో కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల పనుల ఆలస్యమయ్యాయని తెలిపారు.