రూ.70 లక్షలతో బాహుదా వరదగట్టు నిర్మాణం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:58 PM
బాహుదా నది వరద గట్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నా మని, ఇందుకోసం రూ.70 లక్షలతో పనులు చేపట్టనున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నా రు.
ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇచ్ఛాపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బాహుదా నది వరద గట్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నా మని, ఇందుకోసం రూ.70 లక్షలతో పనులు చేపట్టనున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నా రు. ఈ మేరకు బుధవారం పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి వరద గట్టు నిర్మాణం చేపట్టకపోవటం తో వరదలు వస్తే బెల్లుపడ గ్రామం ముంపునకు గురవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు మంజూరయ్యాయన్నా రు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండ లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్‌రెడ్డి, జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ పట్ట ణ అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, ఎన్.కోటి, పలువురు నేతలు పాల్గొన్నారు.
వంటశాల ప్రారంభం
పురుషోత్తపురం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో జేసీఐ క్లబ్ సభ్యులు వెంకటరమణ- జయలక్ష్మి అన్నపూర్ణ పేరుతో రూ.2.5 లక్షలతో నిర్మించిన వంటశాలను ఎమ్మెల్యే బెందాళం అశో క్ ప్రారంభించారు. జేసీఐ సస్ట్రెనబుల్ సౌల్యూ షన్స్ ప్రాజెక్ట్-2026 కింద నిర్మించడం అభి నందనీయమన్నారు. సదుపాయాలు వినియో గించుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో ఎంఈవో సూర్యారావు, ప్రిన్సిపాల్ వైకుంఠరావు, జేసీఐ జోన్-4 ప్రెసి డెంట్ చైతన్య వసంతవాడ పాల్గొన్నారు.