రాజ్యాంగ విలువలను కాపాడాలి
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:40 PM
రాజ్యాంగ విలువలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు కోరారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు
శ్రీకాకుళం లీగల్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ విలువలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక న్యాయసేవాసదన్‌లో జాతీయ న్యాయ సేవాదినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రాజ్యాంగ విలువలపై అవగా హన పెంచుకొని వాటిని కాపాడేందుకు కృషిచేయాలన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం అందించాలని రాజ్యాంగం సూచిస్తోందని, దీనిపై అవగాహ నకు న్యాయసేవాధికార సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు ఆగూరు ఉమామహేశ్వరరావు, గేదల ఇందిరా ప్రసాద్, అన్నెపు భువనే శ్వరరావు, అంబేద్కర్ యూనివర్సిటీ విధ్యార్థులు పాల్గొన్నారు