ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చేయాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:29 PM
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని, అంతవరకు తెలుగు రాష్ట్రాల్లో నిరంతర పోరాటం కొనసాగుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ అన్నారు.
ఇచ్ఛాపురం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని, అంతవరకు తెలుగు రాష్ట్రాల్లో నిరంతర పోరాటం కొనసాగుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ అన్నారు. శుక్రవారం స్ధానిక రోటరీ హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ మాల సామాజిక వర్గాన్ని తొక్కే స్తున్నాయని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా దళితులంతా కలిసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల సీఎంలు దళితులు ఎప్పటికీ రాజ్యాధికారం దిశగా కన్నెత్తి చూడకుండా ఉండేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. దీనిని సమ ర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దళిత నాయకులు సల్ల దేవరాజ్, భగవాన్, బాబూరావు, చంద్రశేఖరం పాల్గొన్నారు.