Share News

సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:02 AM

పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని మందస డీఆర్వో టి. దేవరాజు అన్నారు.

సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అటవీ అధికారులు

మందస డీఆర్వో దేవరాజు

ఇచ్ఛాపురం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని మందస డీఆర్వో టి. దేవరాజు అన్నారు. తేలుకుంచి గ్రామం ఎంపీ యూపీ పాఠశాలలో సోమవారం బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజు వారి జీవితంలో చిన్న మార్పులు పా టించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఆయిల్‌, కరెంట్‌, బొగ్గు, నీరు వాటి వినియోగం అవసరాల మేరకు ఉపయోగించాలన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను నిషేధించాలని కోరారు. అనంతరం ఇంధన పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్య క్రమంలో బీట్‌ అధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:02 AM