గ్రామ స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యం
ABN , Publish Date - May 03 , 2026 | 12:05 AM
మహాత్మా గాంధీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యపడుతుందని రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు గంటా వినయ కుమార్ అన్నారు.
రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు గంటా వినయకుమార్
అరసవల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యపడుతుందని రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు గంటా వినయ కుమార్ అన్నారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో పార్టీ సమావేశం శనివారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ హయాం లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్రం నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు అందిం చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, తద్వారా గ్రామాభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. అప్పటి నుంచి గ్రామాలు అభివృద్ధి చెందాయని, సంఘటన్‌ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పంచాయతీస్థాయి నుంచి కొత్త కమిటీలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ.. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో గ్రామ పంచాయతీల బలో పేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించిందన్నారు. కార్యక్రమం లో సంఘటన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట ప్పారావు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి తెంబూరు మధుసూదనరావు, నేతలు బి.గోవింద గోపాల్, కె.సింహాద్రినాయుడు, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, బస్వా షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.